Nara Lokesh : టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేతల్ని పరామర్శించిన నారా లోకేష్‌

Nara Lokesh : గుంటూరు జిల్లా తెలుగు యువత నాయకులను పరామర్శించేందుకు పెదకూరపాడు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌.;

Update: 2021-11-18 14:30 GMT

Nara Lokesh : గుంటూరు జిల్లా తెలుగు యువత నాయకులను పరామర్శించేందుకు పెదకూరపాడు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌. నారా లోకేష్‌ వస్తున్నారన్న సమాచారంతో... పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు పెదకూరపాడు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. లోకేష్‌ పెద్దకూరపాడు పీఎస్‌కు రావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగు యువత నేతలను మరో స్టేషన్‌కు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా పెద్దకూరపాడు టీడీపీ నేతలు అడ్డగించారు. ఈ క్రమంలో పోలీసులకు, టీడీపీ నేతలకు వాగ్వివాదం జరిగింది.

ఎయిడెడ్‌ విద్యా వ్యవస్థను జగన్‌ సర్కారు నాశనం చేస్తోందంటూ.. ఇవాళ ఉదయం... ఏపీ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు తెలుగు యువత నేతలు. అసెంబ్లీ ప్రధాన మార్గం వరకు వచ్చి నినాదాలు చేశారు. విద్యార్ధుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుంటే నిరసన తెలిపే హక్కు విద్యార్ధులకులేదా అంటూ మండిపడ్డారు. తక్షణమే జీవో 42, 50, 51లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన తెలుగు యువత కార్యకర్తలను అదుపులో తీసుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.


Tags:    

Similar News