Nara Lokesh: అక్కా, చెల్లెమ్మలపై కురిపించిన ఆప్యాయత ఎక్కడికి పోయింది జగన్ గారూ..?: లోకేష్
Nara Lokesh: రాష్ట్రంలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు.;
Nara Lokesh: రాష్ట్రంలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. అక్కా చెల్లెమ్మలపై కురిపించిన ఆప్యాయత ఎక్కడికి పోయింది జగన్ గారూ అంటూ సెటైర్లు వేశారు. ఆడబిడ్డలపై అకృత్యాలు పెరుగుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఏపీలో పట్టపగలు మహిళలు నడవలేని దుస్థితి ఉందన్నారు..
మద్యపాన నిషేధం వరమిస్తున్నానని గతంలో చెప్పిన సీఎం.. ప్రభుత్వంతోనే మద్యం విక్రయించడంపై ఏం సమాధానం చెబుతారని విమర్శించారు. సొంత మద్యాన్ని అమ్ముతూ అక్కాచెల్లెమ్మల పుస్తెలు తెంపేస్తున్నారని ఫైరయ్యారు.. మహిళా ద్రోహిగా సాగుతున్న జగన్ రెడ్డి పాలనని నిరసిస్తూ.. ఈ నెల 31న తెలుగు మహిళ ఆధ్వర్యంలో నారీ సంకల్ప దీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భద్రత, భవిష్యత్ కోసం మహిళలు సాగించే పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందని నారా లోకేష్ చెప్పారు.