Narayana: మాజీ మంత్రి నారాయణపై మరో కేసు.. చంద్రబాబుతో సహా 14 మందిపై ఎఫ్‌ఐఆర్..
Narayana: ఏపీ ప్రభుత్వం అమరావతి భూముల వ్యవహారంలో నాటి ప్రభుత్వ పెద్దల్ని టార్గెట్ చేసింది.;
Narayana: ఏపీ ప్రభుత్వం అమరావతి భూముల వ్యవహారంలో నాటి ప్రభుత్వ పెద్దల్ని టార్గెట్ చేసింది. నిన్న మంగళగిరి CID పోలీసులు నమోదు చేసిన FIRలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరును A1గా చేర్చారు. తర్వాత A2గా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పేరును చేర్చారు. పలువురు వ్యక్తులతోపాటు వివిధ సంస్థల్నీ ఈ కేసులో ప్రస్తావిస్తూ కేసు పెట్టారు. ఇదిప్పుడు సంచలనంగా మారింది.
మాజీ మంత్రి నారాయణపై మరో కేసు నమోదైంది. 2014 నుంచి 2019 మధ్య ఏపీ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్, క్యాపిటల్ సిటీ డిజైన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌లో అక్రమాలు జరిగాయంటూ.. నిన్న మంగళగిరిలోని సీఐడీ అధికారులకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మాజీ సీఎం చంద్రబాబుతో సహా 14 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు సీఐడీ అధికారులు. ఈ ఎఫ్‌ఐఆర్‌లో ఏ1గా మాజీ సీఎం చంద్రబాబుది కాగా ఏ2గా మాజీమంత్రి నారాయణ పేరు ఉంది. వీరిపై సెక్షన్ 120బి, 420, 34, 35, 36, 37, 166, 167 సహా.. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద మంగళగిరి పోలీసులు కేసు నమోదు
ఎమ్మెల్యే ఆర్కే ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఏ3గా లింగమనేని రమేష్, ఏ4గా లింగమనేని వెంటక సూర్య రాజా శేఖర్, ఏ5గా కే.పి.వి. అంజనీ కుమార్, ఏ6గా హెరిటేజ్ ఫుడ్స్, ఏ7గా LEPL ప్రాజెక్ట్స్ , ఏ8గా LEPL ఇన్ఫోసిటీ, ఏ9గా LEPL స్మార్ట్ సిటీ, ఏ10గా లింగమనేని అగ్రికల్చర్ డెవలపర్స్, ఏ11గా లింగమనేని ఆగ్రో డెవలపర్స్, ఏ12గా జయని ఎస్టేట్స్, ఏ13గా రామకృష్ణ హైసింగ్ కంపెనీలతో పాటు ఏ14గా పలువురు ప్రభుత్వ అధికారులు, ఇంకొంతమంది ప్రైవేట్ వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
మాజీ మంత్రి నారాయణను నాటకీయంగా అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. ఏదో పని మీద హైదరాబాద్‌లోని రాయదుర్గం వెళ్తుండగా మార్గమధ్యలో ఐకియా వద్ద నారాయణ కారును ఆపి, అదే కారులో తిరుపతికి తీసుకెళ్లడానికి రెడీ అయ్యారు. కారులో ఉన్న మరో వ్యక్తి దీనిపై తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణ సరిహద్దు దాటుతున్న సమయంలోనే పోలీసులు తీసుకెళ్తున్న నారాయణ కారును ఆపేశారు. ఎంక్వైరీ చేసి, డిటైల్స్ తీసుకుని తిరుపతికి తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం నారాయణను అరెస్ట్ చేసింది పేపర్ లీకేజ్ కేసులోనేనని అధికారులు చెబుతున్నారు.