Neerab kumar prasad :జవహర్ రెడ్డి పై బదిలీ వేటు..!

1987 బ్యాచ్ కు చెందిన నీరభ్ కుమార్ ప్రసాద్, గతంలో భూపరిపాలన ప్రధాన కమిషనర్ గా పనిచేశారు. ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.;

Update: 2024-06-07 04:58 GMT

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య కార్యదర్శిగా (సీఎస్) నీరభ్ కుమార్ ప్రసాద్ ( Neerab kumar prasad )నియామకాన్ని ప్రకటిస్తూ తాజా ఉత్తర్వులు వెలువడిన నేపథ్యంలో జవహర్ రెడ్డి ( K S Jawahar Reddy )పై బదిలీ వేటు పడింది. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయిలో సహకరించారనే అభియోగంతో జవహర్ రెడ్డిపై పలు సార్లు కంప్లైంట్లు చేసిన ప్రతిపక్షాలు.

జవహర్ రెడ్డి ప్రస్తుతం సెలవుపై ఉన్నప్పటికీ, తాజా ప్రభుత్వ ఉత్తర్వులతో అతనిపై బదిలీ వేటు పడ్డట్లు క్లారిటీ వచ్చింది. 1987 బ్యాచ్ కు చెందిన నీరభ్ కుమార్ ప్రసాద్, గతంలో భూపరిపాలన ప్రధాన కమిషనర్ గా పనిచేశారు. ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

Full View

ఈ నియామకంతో, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహణ జవహర్ రెడ్డి చేతుల మీద జరపడానికి చంద్రబాబు విముఖత  చూపడంతో, ఇప్పుడు కొత్త సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Tags:    

Similar News