రైతుల దృష్టిలో జగన్ బటన్ నొక్కే ముఖ్యమంత్రిగానే మిగిలిపోయారు : నిమ్మల రామానాయుడు
పత్రికల్లో రంగురంగుల ప్రకటనలు ఇస్తేనే రైతులను ఉద్ధరించినట్లు కాదని జగన్ గ్రహించాలన్నారు నిమ్మల రామానాయుడు.;
రైతుల దృష్టిలో సీఎం జగన్ బటన్ నొక్కే ముఖ్యమంత్రిగానే మిగిలిపోయారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. తాడేపల్లి రాజప్రసాదంలో కూర్చుని పథకాల పేరుతో బటన్లు నొక్కితేనో.. పత్రికల్లో రంగురంగుల ప్రకటనలు ఇస్తేనే రైతులను ఉద్ధరించినట్లు కాదని జగన్ గ్రహించాలన్నారు.
ఇన్ పుట్ సబ్సిడీ, పంటలబీమా, రైతు భరోసా, సున్నావడ్డీ పథకాల్లో రైతులకు ఒరిగింది శూన్యమని తెలిపారు. 39లక్షల ఎకరాల వరకు ప్రభుత్వం నష్టపోతే ప్రభుత్వం 12లక్షల ఎకరాల వరకే నష్టాన్ని పరిమితం చేసి చేతులు దులుపుకొందన్నారు. సంక్రాంతి లోగా ధాన్యం రైతులకు బకాయిలను చెల్లించాలని లేదంటే రైతుల తరపున టీడీపీ పోరాడుతుందని నిమ్మల పేర్కొన్నారు.