Krishna District: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అయిదుగురి ప్రాణం తీసిన అతివేగం..
Krishna District: కృష్ణా జిల్లా గౌరవరం కాలువ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.;
Krishna District: కృష్ణా జిల్లా గౌరవరం కాలువ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చి కల్వర్టును కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదంలొ తీవ్ర గాయాల పాలైన ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మృతులు ఇందిరా, శాంతి, కుటుంబరావులతో పాటు ఆరు నెలల చిన్నారి ప్రిన్సీలుగా ఉన్నట్లు గుర్తింపు.