AP: వీడిన పాస్టర్ ప్రవీణ్ మృతి మిస్టరీ

బైక్‌ను ఏ వాహనం ఢీ కొనలేదని స్పష్టీకరణ... శరీరంలో మద్యం అనవాళ్లు;

Update: 2025-04-13 03:00 GMT

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో కీలక విషయాలను పోలీసులు బహిర్గతం చేశారు. మార్చి 24 ఈ పాస్టర్ ప్రవీణ్ మరణించగా.. 18 రోజుల పాటు పోలీసులు విచారణ చేశారు. పాస్టర్‌ ప్రవీణ్‌ రోడ్డు ప్రమాదం వల్లే చనిపోయారని ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్‌కుమార్ తేల్చి చెప్పారు. పాస్టన్ తన బైక్ నుంచి పడిపోవడంతో తలకు గాయాలు కావడంతోనే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారని ఐజీ తెలిపారు. అలాగే సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృష్యాలను బట్టి..పాస్టర్ మృతికి ముందు రెండుచోట్ల ప్రమాదానికి గురయ్యారని, మొదటి ప్రమాదం జగ్గయ్యపేట దగ్గర జరిగిందని, రెండో ప్రమాదం.. రామవరప్పాడు జంక్షన్‌ దగ్గర జరిగినట్లు తెలిపారు.

మద్యం తాగడని స్పష్టీకరణ

రెండు ప్రమాదాల్లోనూ ప్రవీణ్‌ మద్యం తాగి ఉన్నారని పెట్రోల్‌బంక్‌ సిబ్బంది ద్వారా వివరాలు సేకరించామని.. ఫోరెన్సిక్ రిపోర్టులోనూ పాస్టర్ ప్రవీణ్ పగడాల బాడీలో లిక్కర్‌ శాంపుల్స్ ఉన్నట్లు తేలిందని ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్‌కుమార్ స్పష్టం చేశారు. ఈ కేసులో. తాము దారి పొడవునా సీసీ కెమెరాలను పరిశీలించామని, సీఎం ఆదేశాల మేరకు ఆధునాతన టెక్నాలజీతో కేసు దర్యాప్తు చేశామన్నారు. కొందరు పాస్టర్ ప్రవీణ్ పగడాలది హత్య అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారని, ప్రవీణ్ మృతిపై అసత్యప్రచారం చేసినవారికి నోటీసులు ఇస్తామన్నారు. ఆయన ఫోన్‌లో మాట్లాడిన వారందరినీ విచారణ చేశామన్నారు. ప్రవీణ్ ఫోన్ పే చేసిన వివరాలు సేకరించామని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులను విచారణ చేశామని తెలిపారు.

ఆరుసార్లు యూపీఐ పేమెంట్లు

ప్రవీణ్‌ దారిలో ఆరుసార్లు యూపీఐ పేమెంట్లు చేశారు. ఆయన శరీరంలో మద్యం ఆనవాళ్లు ఉన్నాయని ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక చెప్పింది. కీసర టోల్‌ప్లాజా వద్ద ఆయన అదుపుతప్పి కింద పడిపోయారు. సాయం చేసేందుకు అంబులెన్స్‌, వైద్య సిబ్బంది వెళ్లారు. రామవరప్పాడు జంక్షన్‌ వద్ద ప్రవీణ్‌ పరిస్థితిని ఆటో డ్రైవర్‌ చూశారు. ట్రాఫిక్‌ ఎస్సై సూచనతో పార్కులో రెండు గంటలు నిద్రపోయారు. కండిషన్‌ బాగోలేదు, వెళ్లవద్దని చెప్పినా ఆయన వినలేదు. హెడ్‌లైట్‌ పగిలిపోవడంతో రైట్‌సైడ్‌ బ్లింకర్‌ వేసుకునే ప్రయాణించారు.

Tags:    

Similar News