Pawan Kalyan : జీతం వద్దన్న పవన్ కళ్యాణ్.. సొంత ఖర్చులతో ఫర్నీచర్

Update: 2024-07-02 07:03 GMT

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) సంచలన కామెంట్స్ చేసారు. పంచాయతీరాజ్ శాఖలో నిధుల దుర్వినియోగం, మళ్లింపు... ఆ ఫలితంగా నిధుల లేమిని వాస్తవంగా చూసిన తర్వాత నాకు జీతం వద్దని అధికారులతో చెప్పానన్నారు.

"తొలుత జీతం తీసుకొని పని చేస్తాను అని చెప్పాననీ.. అప్పులతో మునిగిపోయిన శాఖ బాధ్యతలు చూస్తూ నేను జీతం తీసుకోవడం భావ్యం కాదు అనుకున్నాను.. నా క్యాంపు కార్యాలయానికి చిన్నచిన్న మరమ్మతులు వద్దని చెప్పా. కొత్త ఫర్నీచర్ కూడా పెట్టొద్దని చెప్పా, అవసరమైతే నేనే ఫర్నిచర్ కొనుగోలు చేసి తెచ్చుకుంటాను. ప్రభుత్వం నుంచి మాత్రం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని చెప్పాను" అని డిప్యూటీ సీఎం పవన్ వెల్లడించారు.

సోమవారం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దివ్యాంగురాలు మేడిశెట్టి నాగమణికి మొదటి పింఛను అందించారు. అనంతరం పింఛనుదారులతో మాట్లాడారు.

Tags:    

Similar News