ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ఈ నెల 19వ తేదీ, బుధవారం పదవి బాధ్యతలను స్వీకరించనున్నారు. ఆదివారం మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ప్రకటనను విడుదల చేశారు.
పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్య మంత్రితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను కేటాయించారు. పవన్ కళ్యాణ్ ఆలోచనలకు, జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్న శాఖలను కేటాయించడంతో పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
జనసేన నుంచి కేబినెట్ మంత్రులుగా ఎంపికయిన నాదెండ్ల మనోహర్ ఆహార, పౌర సరఫరాలు, కందుల దుర్గేష్ కు పర్యాటకం, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖలను కేటాయించారు.