Pawan Kalyan : నేడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన

Update: 2024-07-01 05:23 GMT

ఎన్నికల గెలిచిన తర్వాత తొలిసారి మంత్రి పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు. గొల్లపల్లిలో ఉదయం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం చేబ్రోలు నివాసంలో పిఠాపురం జనసేన నేతలతో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. మూడు రోజుల పాటు పవన్ కల్యాణ్ పిఠాపురంలోనే ఉంటారు.

రేపు ఉదయం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ పంచాయతీ, అటవీ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమవుతారు. జులై 3వ తేదీన ఉప్పాడ, యు.కొత్తపల్లిలో పర్యటిస్తారు. అనంతరం టీడీపీ, బీజేపీనేతలతోనూ పవన్ భేటీ అవుతారు.

సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అనంతరం అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షిస్తారు. 3 రోజుల పాటు ఉమ్మడి తూ.గో జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పవన్ పాల్గొంటారు. ఆయనకు స్వాగతం పలికేందుకు జనసైనికులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News