pawan: రక్షణ సిబ్బందికి పవన్ శుభవార్త

ఆస్తి పన్ను మినహాయిస్తూ కీలక నిర్ణయం;

Update: 2025-05-12 05:30 GMT

ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత రక్షణ దళాల్లో పనిచేసే సిబ్బందికి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ శుభవార్త చెప్పారు. సైనికులకు ఆంధ్రప్రదేశ్ అండగా నిలుస్తుందని ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌.. మన ధైర్యవంతులైన సైనికులకు గౌరవం, కృతజ్ఞతగా, ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. భారత రక్షణ దళాల సిబ్బందికి చెందిన ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఈ నిర్ణయం మన దేశ భద్రత కోసం తమ జీవితాలను అంకితం చేసే మన రక్షణ దళాలు, సైన్యం, నౌకాదళం, వైమానిక దళం, పారామిలిటరీ, CRPF సిబ్బంది యొక్క అచంచల ధైర్యాన్ని గౌరవిస్తుందన్నారు.

దేశ భద్రతకు కవచంగా ఇస్రో

దేశ భద్రతే లక్ష్యంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ పనిచేస్తుందని ఛైర్మన్ వి. నారాయణన్ తెలిపారు. దేశ పౌరుల భద్రత, రక్షణకు10 ఉపగ్రహాలు నిరంతరం నిరంతరం పనిచేస్తున్నాయని వెల్లడించారు. ఉపగ్రహ, డ్రోన్ టెక్నాలజీ పరిజ్ణానం లేకపోతే మనం లక్ష్యాలను చేరుకోలేమని వెల్లడించారు. శాటిలైట్లు దేశ భద్రతకు కవచంలా పనిచేస్తున్నాయని తెలిపారు. సముద్ర తీర ప్రాంతాలను నిరంతరం నిఘా ఉంచాలని తెలిపారు.

Tags:    

Similar News