Lagadapati Rajagopal: రాజకీయాల్లోకి లగడపాటి రీ ఎంట్రీపై క్లారిటీ..

Lagadapati Rajagopal: ఓ వివాహ వేడుకకు హాజరైన లగడపాటి.. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో బ్రేక్‌ఫాస్ట్‌ చేశారు.;

Update: 2022-04-24 14:19 GMT

Lagadapati Rajagopal: రాజకీయాల్లోకి లగడపాటి రీ ఎంట్రీ అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని.. ఆయన వర్గీయులు చెపుతున్నారు. నందిగామలో ఓ వివాహ వేడుకకు హాజరైన లగడపాటి.. ఆ సమయంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో బ్రేక్‌ఫాస్ట్‌ చేశారు. అయితే అయితే లగడపాటి, వసంత కృష్ణప్రసాద్‌ బ్రేక్‌ ఫాస్ట్‌పై రాజకీయ పుకార్లు రావడంతో.. దీనిపై ఆయన వర్గీయులు క్లారటీ ఇచ్చారు. లగడపాటి టూర్‌లో ఎటువంటి రాజకీయ కోణం లేదని.. కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన నేపథ్యంలో.. పాత పరిచయస్తులను కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారన్నారు.

Tags:    

Similar News