Avanthi Srinivas: కాన్వాయ్ ఢీకొని వ్యక్తి మృతి.. ఆదుకుంటానని మంత్రి హామి..
Avanthi Srinivas: విశాఖలో మంత్రి కాన్వాయ్ ఢీకొని మృతి చెందిన ఘటనలో కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు.;
Avanthi Srinivas (tv5news.in)
Avanthi Srinivas: విశాఖలో మంత్రి కాన్వాయ్ ఢీకొని మృతి చెందిన ఘటనలో కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. నిన్న ఎయిర్ పోర్ట్ నుంచి వస్తున్న మంత్రి అవంతి శ్రీనివాస్ కాన్వాయ్‌లోని ఓ వాహనం బైక్‌పై వెళుతున్న వ్యక్తిని లైట్ గా ఢీకొట్టడంతో అతను కిందపడిపోయాడు. వెనకనే వస్తున్న మరో వాహనం అతనిపైనుంచి వెళ్లినట్లు సీసీ టీవీ ఫుటేజ్‌లో స్పష్టమైంది.
మృతిచెందిన వ్యక్తి విజయనగరం జిల్లా గణపతినగరంకు చెందిన సూర్యనారాయణగా పోలీసులు గుర్తించారు. సూర్యనారాయణకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మంత్రి వాహనం ఢీకొట్టడంతోనే మృతి చెందాడంటూ.. అవంతి శ్రీనివాస్ ఇంటిముందు మృతుని బంధువులు ఆందోళన చేశారు. మంత్రిని కలిసి న్యాయం చేయాలని కోరారు. సూర్యనారాయణ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.