ప్రాణం మీదకు తెచ్చిన పేకాట.. పెన్నా నదిలో చిక్కుకున్న యువకులు..

Update: 2025-09-16 08:40 GMT

పెన్నా నదిలో పది మంది యువకులు చిక్కుకుపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమయానికి అధికారులు స్పందించడంతో వీరంతా క్షేమంగా బయటపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం...నెల్లూరు నగర పరిధిలోని భగత్‌సింగ్ నగర్ కాలనీకి చెందిన పది మంది యువకులు ఎవరికీ తెలియకుండా పేకాట ఆడుకునేందుకు పెన్నా నది మధ్యలోకి వెళ్లారు. అదే సమయంలో, సోమశిల డ్యామ్ నుంచి అధికారులు నీటిని విడుదల చేయడంతో...నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో యువకులు నది మధ్యలోనే చిక్కుకుపోయారు. అయితే యువకుల కేకలు విన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి, రోప్‌ల సహాయంతో యువకులను సురక్షితంగా నదిలోంచి ఒడ్డుకు తీసుకొచ్చారు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News