Polavaram Project: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తుది గడువు ఖరారు కాలేదు: కేంద్రం

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తుది గడువు ఇంకా ఖరారు కాలేదని కేంద్రం వెల్లడించింది.

Update: 2022-04-04 11:45 GMT

Polavaram Project (tv5news.in)

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తుది గడువు ఇంకా ఖరారు కాలేదని కేంద్రం వెల్లడించింది. రాజ్యసభలో ఎంపీ సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌ శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.. రైతులకు పరిహారం పెంపుపై ఏపీ ప్రభుత్వం ఇంకా ఏమీ తేల్చలేదన్నారు.. పోలవరం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే నిర్మిస్తోందని.. 2022 ఏప్రిల్‌ నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తికావాలనేది లక్ష్యమని.. గడువు లోపల ఇర్మాణం పూర్తి కాలేదని కేంద్రం చెప్పింది..

కోవిడ్‌తోపాటు రాక్‌ఫిల్‌ డ్యామ్‌ పగళ్లు, నెర్రలు రావడం తదితర కారణాల వల్ల నిర్మాణం ఆలస్యమైందని తెలిపింది.. ప్రాజెక్టు నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో తుది గడువు నిర్ధారణకు 2021 నవంబరులో కమిటీ ఏర్పాటైందని.. ఇప్పటి వరకు రెండుసార్లు కమిటీ సమావేశమైందని తెలిపింది.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించారని పేర్కొంది.. రైతులు ఎకరాకు మరో ఐదు లక్షలు అడుగుతున్నారని.. పరిహారం పెంపు, పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Tags:    

Similar News