Srikakulam: వాగులో పడ్డ ప్రైవేట్ బస్సు.. గాయాలతో బయటపడిన ప్రయాణికులు..
Srikakulam: శ్రీకాకుళం జిల్లా పెద్ద తామరాపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.;
Srikakulam: శ్రీకాకుళం జిల్లా పెద్ద తామరాపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పశ్చిమబెంగాల్ నుంచి బెంగుళూరుకు వలస కూలీలతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వాగులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 22 మందికి తీవ్ర గాయాలు కాగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను టెక్కలి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.