Pulasa Fish : రికార్డు ధర పలుకుతున్న పులస... వర్షాకాలంలో ఫుల్ క్రేజ్...

Update: 2025-07-23 10:30 GMT

పుస్తెలు అమ్మి అయిన పులస తినాలంటారు గోదావరి ప్రాంత ప్రజలు. పులస కు ఉన్న క్రేజ్ అలాంటిది. వేలు పోసి అయిన సరే పులసను కొనడానికి క్యూలు కడుతుంటారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు మత్స్యకారులు సైతం పులసల కోసం వేట కొనసాగిస్తుంటారు. ఒక్క చాప దొరికితే చాలు వేల రూపాయలు సంపాదించుకోవచ్చని ఆశ పడుతుంటారు. కేవలం గోదావరి ప్రాంత ప్రజలే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో కూడా పులసలకు ఫ్యాన్స్ ఎక్కువే ఉన్నారు. ఒక్క కేజీ చేపకు సుమారు రూ.5 వేల నుండి 50 వేల వరకు పలుకుతుందంటేనే అర్ధం వేసుకోవచ్చు పులస డిమాండ్ ఎలా ఉంటుందో...

తాజాగా గోదావరి నదికి వరద ప్రవాహం పెరగడంతో పులసల కోసం వేట మొదలైంది.అయితే గతంలో మాదిరిగా ఎక్కువ సంఖ్యలో పులస చేపలు మత్స్యకారులకు దొరక్కపోవడంతో.. డిమాండ్ భారీగా పెరిగిపోయింది. దీంతో ఈ రోజు ఉదయం యానాంలో గంగపుత్రుల వలకు చిక్కిన పులస చేప రికార్డు ధర పలికింది. 2 కేజీల చేపను.. వేలంలో రూ.26 వేలకు ఆత్రేయపురం పేరవరం కు చెందిన బెజవాడ సతీష్ కొనుగోలు చేశాడు. కాగా గత రెండు రోజుల క్రితం జరిగిన వేలంలో 22,000 కు అమ్మడు పోగా.. తాజాగా ఆ రికార్డు బ్రేక్ అయింది. ఈ సీజన్లో ఇదే ఇప్పటి వరకు పలికిన అత్యధిక ధరగా స్థానికులు చెబుతున్నారు.

Tags:    

Similar News