AP Forest Department : ఏపీ అటవీ శాఖకు కొత్త అధిపతిగా పి.వి. చలపతిరావు..
ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖకు నూతన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్)గా 1994 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పి.వి. చలపతిరావు నియమితులయ్యారు. పదవీ విరమణ చేసిన ఎ.కె. నాయక్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. కాగా ఈ నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఉత్తర్వులు జారీ చేయడంతో... అటవీశాఖ ప్రధాన కార్యాలయంలో చలపతిరావు బాధ్యతలు స్వీకరించారు. 2028 జూన్ చివరి వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
అటవీ శాఖ లో విశేష అనుభవం ఉన్న చలపతి రావు...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కామారెడ్డి సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అటవీశాఖ ప్రణాళిక విభాగం, ప్రత్యేక కార్యదర్శిగా సుదీర్ఘకాలం సేవలందించారు. ఆ తర్వాత ఎర్రచందనం, ప్రొడక్షన్ విభాగాలకు పీసీసీఎఫ్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు.