అక్కడ పోటీ చేస్తే 2 లక్షలకు పైగా మెజార్టీతో గెలుస్తా: రఘురామకృష్ణ రాజు

Update: 2020-10-20 15:47 GMT

తమకు కులం, మతం లేదని చెప్పే వైసీపీ ఇప్పుడు చేస్తోంది ఏంటని ప్రశ్నించారు ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణ రాజు. రాష్ట్రంలో చర్చిల నిర్మాణం కోసం ప్రభుత్వ నిధులు విడుద చేయడం రాజ్యంగ విరుద్ధమన్నారు. మత సంస్థలకు రాజ్యంగం ప్రకారం ప్రభుత్వం నిధులు ఇవ్వకూడదని స్పష్టంగా ఉందన్నారు.. అలాగే ప్రజాభిప్రాయం ప్రకారమే ఇసుక విధానం ప్రకటించడమంటే.. ఇన్ని రోజులూ సరైన ఇసుక విధానం లేదన్నటేగా అని విమర్శించారు..

అమరావతి రిఫరెండెంగా ఆ ప్రాంతంనుంచి సీఎం తనపై పోటీ చేస్తే కచ్చితంగా 2 లక్షలపైగా మెజార్టీ గెలుస్తానని మరోసారి స్పష్టం చేశారు. సీఎం తనపై పోటీ చేస్తే అమరావతి కోసం ఆయన్న ప్రజలు ఓడిస్తారన్నారు. మరోవైపు ఏపీలో గ్రామ సచివాలయ కార్యదర్శుల జీతాలను 5 వేల నుంచి 8 వేలకు పెంచాలని ఆయన డిమాండ్‌ చేశారు..

Tags:    

Similar News