Nara Lokesh : రెడ్ బుక్ చాప్టర్ 2 మొదలవుతుంది.. లోకేశ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

Update: 2024-11-01 12:00 GMT

వారం రోజులపాటు సాగిన లోకేష్ అమెరికా పర్యటన ముగిసింది. రెడ్ బుక్‌లో ఒక చాప్టర్ అయిపోయిందని.. రెండోది ఓపెన్ అయ్యిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి నారా లోకేష్‌. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కచ్చితంగా సినిమా చూపిస్తానని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రెండో చాప్టర్‌తోనే ఆగిపోను.. అతి త్వరలోనే మూడో చాప్టర్ కూడా ఓపెన్ చేస్తానని స్పష్టం చేశారు. అమెరికాలోని అట్లాంటాలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రెడ్‌బుక్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యువగళం పాదయాత్ర సమయంలో తనను అనేక ఇబ్బందులకు గురిచేశారన్నారు. రెడ్ బుక్‌కు భయపడి జగన్ గుడ్ బుక్ తీసుకొస్తా అంటున్నాడు. ఆ బుక్‌లో ఏం రాయాలో అర్ధం కావడం లేదని చెబుతున్నారని లోకేష్ సెటైర్లు వేశారు.

Tags:    

Similar News