Pattiseema : పట్టిసీమ నుంచి నేడు నీరు విడుదల

Update: 2024-07-03 05:27 GMT

రాయలసీమ, కృష్ణా డెల్టాలకు సాగు, తాగు నీరు అందించేందుకు పట్టిసీమ నుంచి ఇవాళ ఉదయం నీరు విడుదల చేయనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పట్టిసీమ నుంచి 7 వేల క్యూసెక్కులు, తాడిపూడి ఎత్తిపోతల నుంచి 870, పురుషోత్తపట్నం నుంచి 3500, పుష్కర నుంచి 1225 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామన్నారు. ఎగువ నుంచి వరద జలాలు రాకపోవడంతో కృష్ణా నదీ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు అడుగంటాయన్నారు.

పట్టిసీమను వట్టిసీమగా జగన్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది.. ఇప్పుడు అదే పట్టిసీమ కృష్ణా డెల్టాకు బంగారు సీమగా మారింది.. టీడీపీ పాలనాలో సుమారు 300 టీఎంసీల నీటిని పట్టిసీమ ద్వారా ఇచ్చి 30 లక్షల ఎకరాల్లో సాగుకు ఇబ్బందు లేకుండా చూశామని.. సీఎంచంద్రబాబు ముందు చూపుతో పట్టిసీమ ఎత్తిపోతల రైతులకు సాగునీరు అందే పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు.

ఈ రోజు పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి పోలవరం కుడి కాలువలోకి నీటి విడుదల చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.. మొదటి విడతగా వెయ్యి క్యూసేక్కుల నీటిని కుడికాలులోకి విడుదల చేశారు.. పట్టిసీమ లిఫ్ట్ వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అధికారులతో కలిసి నీటి విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి నిమ్మల రామా నాయుడు.

Tags:    

Similar News