AP : జగన్ క్యాంప్ ఆఫీస్ పరిసరాల్లో ఆంక్షల ఎత్తివేత

Update: 2024-06-17 06:27 GMT

గుంటూరు జిల్లా తాడేపల్లిలో జగన్ ప్రభుత్వం అమలుచేసిన ఆంక్షలను ఎత్తేసింది టీడీపీ ప్రభుత్వం. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నివాసం పరిసర ప్రాంతాల్లో బారికేడ్లు, ఇనుకకంచెలను రహదారులను గత ప్రభుత్వం మూసివేసింది. ఈ ఆంక్షల వల్ల ఈ ప్రాంత ప్రజలు రాకపోకలకు ఇబ్బందులకు గురయ్యేవారు.

కూటమి ప్రభుత్వం వచ్చాక ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. జగన్ క్యాంపు కార్యాలయం ముందు ఆంక్షలను ఎత్తివేశారు. బారికేడ్లను తొలగించడంతో విశాలమైన రోడ్డు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

ఐదేళ్లుగా ఉండవల్లి నుంచి మంగళగిరి వెళ్లే మార్గం మూసివేసిన రోడ్డు మార్గం తిరిగి ప్రారంభం కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రహదారి విస్తరణ పేరుతో వందలాది ఇళ్లను అప్పటి ప్రభుత్వం కూల్చి వేసింది. స్థానికులపై కక్షతో అమరనగర్ లో ఆక్రమణల పేరుతో ఇళ్లు తొలగించారని వాలంటీర్ శివశ్రీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను ఉద్యోగం నుంచి కూడా తొలగించారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రహదారిని తిరిగి ప్రారంభించడంతో తాడేపల్లి ప్రజలు హ్యాపీగా ఫీలవుతున్నారు.

Tags:    

Similar News