ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపారని మాజీ మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు నరకం చూపిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలు, కార్యకర్తలను వేధిస్తున్న కూటమి ప్రభుత్వానికి తాము అధికారంలోకి వస్తే వడ్డీతో సహా చెల్లిస్తాం అని ఆమె హెచ్చరించారు. నగరి నియోజకవర్గం లో భవిష్యత్తు కార్యాచరణ పై నిర్వహించిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు రోజా. తప్పు చేసి వైసీపీ ఓడిపోలేదని చెప్పారు రోజా. కూటమి ప్రభుత్వ తప్పుడు ప్రచారం వల్లే ఓడిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కుప్పం సహా 14 స్థానాలను కైవసం చేసుకుంటాం అన్నారు. ఆరు నెలల్లోనే ఆలీబాబా అరడజను దొంగల్లా మారారని కూటమి ప్రభుత్వం పై రోజా విమర్శలు గుప్పించారు. జగనన్నను ఎందుకు ఓడించామనే పశ్చాత్తాపం ప్రజల్లో కనిపిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు.