RTA CHECKINGS: మృత్యు ఘోష.. కదిలించింది
ప్రైవేట్ బస్సులపై అధికారుల నజర్.. కర్నూలు ప్రమాదంతో అధికారుల అప్రమత్తం.. తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా బస్సు తనిఖీలు.. లైసెన్సు, బస్సు పత్రాలు క్షుణ్ణంగా పరిశీలన
కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో తెలంగాణ రవాణా శాఖ అప్రమత్తమైంది. ప్రైవేటు బస్సులను అధికారులు తనిఖీ చేస్తున్నారు. విజయవాడ హైవే, బెంగళూరు హైవేపై ఆర్టీఏ బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి. రాజేంద్రనగర్ పరిధి గగన్ పహాడ్ వద్ద సోదాలు చేశారు. ఏపీ నుంచి వస్తున్న ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. వాహనాల్లోని ఫైర్ సేఫ్టీ, మెడికల్ కిట్లను పరిశీలించారు. నిబంధనలు పాటించని 5 ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. బస్సు అద్దం పగిలినా అలాగే నడుపుతున్న ట్రావెల్స్ బస్సును సీజ్ చేశారు. జడ్చర్ల వద్ద ఈ వాహనం రోడ్డుప్రమాదానికి గురైందని ప్రయాణికులు తెలిపారు. ఎల్బీ నగర్లోని చింతలకుంట వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ట్రావెల్స్ బస్సును సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న మరో 4 బస్సులపై కేసులు నమోదు చేశారు.
సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారుల తనిఖీలు చేస్తున్నారు. రాజేంద్రనగర్ పరిధి గగన్ పహాడ్ వద్ద సోదాలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ నుంచివస్తున్న ట్రావెల్స్ బస్సులను చెక్ చేశారు. వాహనాల్లోని ఫైర్ సేఫ్టీ, మెడికల్ కిట్లను పరిశీలించారు. ఎల్బీ నగర్లోని చింతలకుంట వద్ద పలు వాహనాలను తనిఖీలు చేశారు. కాగా, కర్నూలు అగ్ని ప్రమాద ఘటన దృష్ట్యా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాజేంద్రనగర్, ఎల్బీనగర్ చింతలకుంటలో ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న బస్సులను తనిఖీ చేశారు. బస్సుల్లో ఫైర్ సేఫ్టీ, మెడికల్ కిట్లను పరిశీలించారు. రాజేంద్రనగర్లో నిబంధనలు పాటించని ఐదు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదుచేశారు. చింతలకుంట వద్ద నిబంధనలు ఉల్లంఘించిన ఓ ట్రావెల్స్ బస్సును సీజ్ చేశారు. మరో నాలుగు బస్సులపై కేసులు నమోదుచేశారు. మహబూబ్నగర్, నల్గొండ, కోదాడ, కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్ శివారు ప్రాంతాలలో ఈ రైడ్స్ కొనసాగుతున్నాయి. శంషాబాద్, వనస్థలిపూరం, గగన్ పహాడ్, అల్విన్ చౌరస్తా, ముంబాయి హైవేపై తనిఖీలు చేస్తున్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, నాగాల్యాండ్, ముంబై నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చే ప్రతి వాహనాన్ని చెక్ చేశారు.
బస్సులపై 289 కేసులు
కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో ఏపీలో రవాణా శాఖ రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ముమ్మరంగా తనిఖీలు చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన 289 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసింది. 18 బస్సులను సీజ్ చేసింది. ఏకంగా రూ.7.08 లక్షల జరిమానాలు విధించింది. అత్యధికంగా ఏలూరులో 55 కేసులు నమోదు చేశారు. , బస్సుకు సంబంధించిన ఆర్సీ, ఫిట్నెస్ సర్టిఫికేట్, ఆర్సి, ఫిట్నెస్, బీమా, పర్మిట్, పన్ను, డబుల్ డ్రైవర్, ఎస్కార్ట్ ఫైర్ ఎక్స్టింజిషర్ తో పాటు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ లను క్షుణ్ణంగా రవాణా శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. నేటి ఉదయం నుంచి ఈ దాడులు కొనసాగుతున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు.. కర్నూలు బస్సు ప్రమాదం జరిగిన తరువాత ఆర్టీఏ అధికారులు కళ్లు తెరిచారా అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తమ ప్రాణాలు పోయిన తరువాత అధికార యంత్రాంగం రెండు మూడు రోజులు హడావుడి చేయడం తప్పా అంతా షరా మాములే అంటున్నారు.