YS Sharmila : ఐదేళ్లు బీజేపీతో జగన్ అక్రమ సంబంధం.. షర్మిల మరో సంచలన విమర్శ
ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy ) టార్గెట్ గా రెచ్చిపోయి విమర్శలు చేస్తున్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ( Y S Sharmila ). మరోసారి జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారామె. ఢిల్లీలో జగన్ చేసిన ధర్నాపై వైఎస్ షర్మిల చురకలు అంటించారు. ఢిల్లీలో జగన్ చేసింది ధర్నా కాదు.. కపట నాటకం అన్నారు షర్మిల. కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలన్న జగన్ మాటలను షర్మిల గుర్తుచేశారు.
జగన్ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి ? అంటూ నిలదీశారు షర్మిల. పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా..? అంటూ ఆగ్రహించారు షర్మిల. వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా..? ఐదేళ్లు బీజేపీతో అక్రమ సంబందం పెట్టుకుని, విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టి.. ఆఖరుకి మణిపూర్ ఘటనపై నోరెత్తని మీకు…ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరం అంటూ ఫైర్ అయ్యారు షర్మిల. క్రిస్టియన్ అయి ఉండి క్రైస్తవులను ఊచకోత గురి చేశారని గుర్తు చేశారు షర్మిల. నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకే మద్దతు ఇచ్చారు కదా? అంటూ నిప్పులు చెరిగారు షర్మిల.
YSR వ్యతిరేకించిన మతతత్వ బీజేపికే జగన్ జై కొట్టారని షర్మి అన్నారు.మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే జగన్ నుంచి సంఘీభావం రాలేదు అంటూ ఫైరయ్యారామె. గతంలో బీజేపీ ఉంచుకున్న పార్టీ వైసీపీ అని ఫైర్ అయిన షర్మిల.. ఇప్పుడు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని విమర్శించడం హాట్ టాపిక్ గా మారింది.