రిమాండ్ రిపోర్టులో షాకింగ్ నిజాలు.. జోగి రమేశ్ కీలక పాత్ర

Update: 2025-11-04 06:25 GMT

మద్యం తయారీ సూత్రదారి జోగి రమేశ్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. జనార్థ్ రావును ముందుంచి కథ అంతా నడిపారు. జయచంద్రారెడ్డి, గిరిధర్ రెడ్డి ములకల చెరువులో ఈ దందా వద్దని వారించినా సరే జోగి రమేశ్ అస్సలు వినిపించుకోలేదంట. తాను మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఎలాంటి అడ్డంకులు రావు కోట్లు దండుకుందాం అని రెచ్చిపోయాడంట. ఇప్పుడు జోగి రమేశ్ విచారణలో ఇవన్నీ బయటకు వస్తున్నాయి. కల్తీ మద్యాన్ని కూటమి ప్రభుత్వంపై నెట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేసి చివరకు ఆయనే అరెస్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ములకల చెరువులో కల్తీమద్యం కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన పాత్రదారి జోగి రమేశ్.

ఏ1గా ఉన్న జనార్థన్ రావును ముందుంచి జోగి కథ అంతా నడిపించారు. ఈ మొత్తం సిట్ విచారణలో బయట పడింది. ఏ1 జనార్థన్ రావు, ఏ2 కట్టా రాజు ఈ వ్యవహారం మొత్తం ముందుడి నడిపించారు. కానీ వారి వెనకాల ఉంది జోగి రమేశ్. ఈ కల్తీమద్యం కేసులో డబ్బు వ్యవహారం అంతా చూసుకునేది కట్టా రాజు. ఇతని దగ్గరి నుంచి కల్తీమద్యం డబ్బు జనార్థన్ రావు అకౌంట్ లోకి వెళ్లేది. ఆ తర్వాత అది జోగి రమేశ్ కు చాలా రకాల రూపాల్లో వెళ్లేది. ఇలా జోగి రమేశ్ తాను డైరెక్ట్ గా అందులో పాల్గొనకుండానే వెనకుండి ఈ కల్తీ దందాను నడిపించాడు. జయచంద్రారెడ్డి, గిరిధర్ రెడ్డి, జనార్థన్ రావుతో జోగి రమేశ్ వేర్వేరుగా ఫోన్లో మాట్లాడినట్టు సిట్ విచారణలో తేలింది.

జనార్థన్ రావుకు రూ.3 కోట్లు ఇచ్చి విదేశాలకు వెళ్లిపోవాలన్నాడు జోగి రమేశ్. ఇదే ఆఫర్ జయచంద్రారెడ్డి, గిరిధర్ రెడ్డి విదేశాలకు వెళ్లడానికి ఒప్పుకోలేదు. కానీ జనార్థన్ రావు ఆ డబ్బు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని జనార్థన్ రావు చెప్పి నేరుగా జోగి రమేశ్ ను కలిశాడు. కొన్ని రోజులకే ఆఫ్రికా వెళ్లాడు జనార్థన్ రావు. ఆ తర్వాత జయచంద్రారెడ్డి కూడా ఆఫ్రికా వెళ్లాడు. దీంతో వీళ్ల బాగోతం మొత్తం బయట పడింది. ఇందులో సిట్ ఇంకా విచారణ జరుపుతోంది. త్వరలోనే మరిన్ని వివరాలను బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో 5గురిని విచారణ కోసం సిట్ అదుపులోకి తీసుకోనుంది. త్వరలోనే మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి.


Full View

Tags:    

Similar News