AP : పల్నాడు కౌంటింగ్ పై ఎస్పీ మల్లికా గార్గ్ మరో సంచలన ప్రకటన

Update: 2024-06-01 07:47 GMT

ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిపేందుకు ప్రజలందరూ సహకరించాలని పల్నాడు జిల్లా SP.మల్లికా గార్గ్ అన్నారు. గురజాల నియోజకవర్గం లోని పిడుగురాళ్ల దాచేపల్లి పట్టణాల్లో సెంట్రల్ ఆర్మూడ్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ బలగాలతో మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు పల్నాడు జిల్లా SP .మల్లికా గార్గ్.

ఈ సందర్భంగా SP.మాట్లాడుతూ ఎన్నికలవేళ పలనాడు జిల్లాలో చోటుచేసుకున్న హింస నేపథ్యంలో ప్రజల ఆస్తులు ధ్వంసం అయ్యాయని లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని అలాంటి చర్యలు మళ్లీ రిపీట్ కాకుండా జూన్ 1 నుండి జూన్ 5వ తారీఖు వరకు పల్నాడు జిల్లాలో కఠినమైన 144 సెక్షన్ అమలుపరుస్తున్నామని ప్రజలందరూ తప్పక సహకరించాలని సూచించారు.

ఎన్నికల ఫలితాల వేల రోడ్ షోలు బాణసంచా కాల్చడం లాంటివి నిషేధించామని ఎవరైనా అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్నికలవేళ పల్నాడు లో జరిగిన హింసని దృష్టిలో ఉంచుకొని వేల మంది ఫోర్స్ తో పల్నాడు ప్రాంతం మొత్తాన్ని డేగ కంటితో కాపలా కాస్తున్నామని ఎవరైనా హింస ని ప్రేరేపిస్తే పీడీ యాక్ట్ ఓపెన్ చేస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా పలనాడు కు చాలా చెడ్డ పేరు వచ్చిందని ఎన్నికల కౌంటింగ్ సజావుగా సాగేలా చూసి పల్నాడు గౌరవాన్ని నిలబెడతామన్నారు.

Tags:    

Similar News