ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ముఖ్యమైన క్రిమినల్ కేసులు గత ఎన్నో ఏళ్లుగా ప్రజల్లో అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా పరిటాల రవి హత్య, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వంటి కేసుల్లో కీలక పాత్రదారులు లేదా సాక్షుల మరణాలు వరుసగా చోటు చేసుకోవడం మనం చూశాం. ఇప్పుడు పరకామణి కేసులో కీలక సాక్షి అయిన సతీష్ కూడా అనుమానాస్పదంగా చనిపోయాడు. ఆ కేసులన్నీ మరింత సందేహాలు పెంచుతున్నాయి. పరిటాల రవి కేసులో కీలకంగా ఉన్న మొద్దు శీనును ఓం ప్రకాశ్ అనే వ్యక్తి చంపేశాడని కట్టు కథ అల్లారు. అప్పుడు జైలు డీఐజీగా ఉన్న వ్యక్తికి జగన్ ప్రభుత్వంలో కీలక పదవి కట్టుబెట్టారు. అసలు రవి ఎలా హత్య చేయబడ్డారన్న విషయం ఇంకా తెలియదు.
అదే విధంగా, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా ఇలాంటి అనుమానాస్పద మరణాలు జరిగాయి. కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో డ్రైవర్ నారాయణ యాదవ్ ఆకస్మిక మరణం, వాచ్ మెన్ రంగన్న మరణం, కేసులో కీలకంగా చెప్పబడిన కల్లూరు గంగాధర్ రెడ్డి మరణం వరుసగా చోటుచేసుకోవడం ప్రజల్లో అనుమానాలను కలిగించింది. అలాగే వైఎస్ అభిషేక్ రెడ్డి ఆరోగ్య సమస్యల కారణంగా మరణించటం కూడా చర్చనీయాంశమైంది. ఈ కేసులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్న పలువురు వ్యక్తులు వరుసగా మరణించడం ఏంటి.
ఇవన్నీ రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో, సోషల్ మీడియాలో ఎన్నో ఊహాగానాలకు దారితీస్తోంది. మరీ ముఖ్యంగా వైఎస్ కుటుంబం గురించి మాట్లాడుతారో, లేదంటే వైసీపీ నేతలకు సంబంధం ఉన్న కేసుల్లో సాక్ష్యులందరూ రైలు దూకి చనిపోవడం ఎప్పటి నుంచో జరుగుతోంది. కానీ ఆ సాక్ష్యులు ఎలా చనిపోతారో మాత్రం ఇప్పటికీ తేలట్లేదు. ఈ కేసులు ఎన్నేళ్లు గడిచినా కూడా, ఇంకా అనేక ప్రశ్నలు సమాధానాల కోసం ఎదురుచూస్తున్నారు ప్రజలు. ఇప్పుడు సతీష్ మరణం కూడా రైలులోనే జరిగింది. సీబీఐ వాంగ్మూలం ముందు హాజరయ్యే టైమ్ లో ఇలా చనిపోవడం నిజంగానే అనుమానమే కదా. మరి ఈ కేసులో ఏం తేలుతుందో చూడాలి.