ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల అనంతరం హింసపై కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంది. పలనాడు జిల్లా కలెక్టర్ పై సీఈసీ బదిలీ వేటు వేసింది.
పల్నాడు ఎస్పీ, అనంతపురం ఎస్పీని సస్పెండ్ చేసింది సీఈసీ. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటు వేసింది. 3 జిల్లాల్లో 12మంది పోలీస్ అధికారుల బదిలీ చేసింది.
15 రోజులపాటు 25 కంపెనీల కేంద్ర బలగాల మోహరించాలని సూచించింది. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను సీఈసీ ఆదేశించింది. హింసాత్మక ఘటనలపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి, సీఎస్ కు సీఈసీ సూచించింది. అల్లర్లకు పాల్పడిన వారిపై చార్జిషీటు దాఖలు చేయాలని తెలిపింది.