దేశంలో స్వదేశీ వస్తు వినియోగం పెరగాలని వస్తువు తయారీ వినియోగం ద్వారా స్వదేశీ ఉద్యమం ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు మాధవ్ అన్నారు. భారతదేశం ఆత్మ నిర్భర్ ద్వారా స్వయం సమృద్ధి సాధించాలని మోడీ ఆకాంక్షిస్తున్నారని అన్నారు. ట్రంప్ విదేశీ సుంకాలు పెంచడం ద్వారా భారత్ అభివృద్ధిని దెబ్బతీసే విధంగా ప్రయత్నిస్తున్నారని ఇటువంటి సమయంలో భారతీయులు కలిసికట్టుగా ఉండాలని అన్నారు. వచ్చే దసరా దీపావళి కానుకగా జిఎస్టిని మోడీ సులభతరం చేశారని స్వదేశీ వస్తు తయారీపై జిఎస్టి చదలింపు ద్వారా పేద మధ్యతరగతి కుటుంబీకులు తో సహా రైతన్నలు లబ్ధి పొందుతున్నారని అన్నారు. జిఎస్టి సడలింపు వలన నిత్యవసర వస్తువు ధరలు తగ్గుతున్నాయని అన్నారు హెల్త్, జీవిత బీమా ఇన్సూరెన్స్ లపై జీరో పెర్సెంట్ జిఎస్టి విధానాన్ని అవలంభించడం ద్వారా ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. భారతదేశ ఆర్థిక సంక్షోభావాలను ఎదుర్కొని నిలబడే సత్తా ఉందని మాధవ్ అన్నారు.