AP Bandh : ఇవాళ ఏపీ బంద్‌కు పిలుపునిచ్చిన టీడీపీ..!
AP Bandh : తెలుగుదేశం పార్టీ ఇవాళ ఏపీ బంద్‌కు పిలుపునిచ్చింది. టీడీపీ సెంట్రల్ ఆఫీస్....పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై దాడులను నిరసిస్తూ.. రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది టీడీపీ.;
AP Bandh : తెలుగుదేశం పార్టీ ఇవాళ ఏపీ బంద్‌కు పిలుపునిచ్చింది. టీడీపీ సెంట్రల్ ఆఫీస్....పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై దాడులను నిరసిస్తూ.. రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది టీడీపీ. దాడులపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిందని మండిపడ్డారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీస్‌లో దాడి దృశ్యాలను పరిశీలించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. పోలీసులు వైసీపీ మూకలను అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్నారు. పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వమంటే ఇవ్వరా.. అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పక్కనే డీజీపీ, సీఎం నివాసాలు వున్నాయని....దాడులు జరిగితుంటే నిఘా విభాగం ఏం చేస్తోందని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీ సీఎం, డీజీపీ కలిసే ఈ దాడి చేయించారని ఆరోపించారు. ప్లాన్ ప్రకారమే రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు తెగబడ్డారని...వైసీపీ సర్కార్‌పై ఫైర్ అయ్యారు టీడీపీ అధినేత. టీడీపీ ఆఫీస్‌లపై దాడులు... స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంగా ఆరోపించారు.
హెరాయిన్ గురించి టీడీపీ నేతలు మాట్లాడటమే తప్పా...అన్న చంద్రబాబు...ఏపీలో గంజాయి సాగు ఉందని పక్క రాష్ట్రాల డీజీపీలు చెప్పారని గుర్తుచేశారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే టీడీపీ కార్యాలయాలపై దాడులు జరిగాయని చంద్రబాబు మండిపడ్డారు. దాడి విషయం తెలియకుంటే ఆ పదవికి డీజీపీ అర్హుడా?'' అని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీలో 356 అధికరణం ఎందుకు ప్రయోగించకూడదని చంద్రబాబు ప్రశ్నించారు.?
దాడి విషయమై డీజీపీకి ఫోన్ చేస్తే ఎత్తలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ''గవర్నర్, కేంద్రమంత్రి ఫోన్ ఎత్తారు.. డీజీపీ ఎత్తరా? అని ప్రశ్నించారు. కొందరు చేసే పనులతో పోలీసు వ్యవస్థ భ్రష్ఠుపట్టిందన్నారు టీడీపీ అధినేత. రెండున్నరేళ్లుగా మీ వేధింపులు చూస్తున్నాం. రౌడీలతో రాజకీయాలు చేస్తారా? అని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వాదులంతా ఈ దాడులను ఖండించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇవాళ్టి బంద్‌ను జయవంతం చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
ఏపీలో పరిస్థితులపై కేంద్ర హోంశాఖ వర్గాలతో చంద్రబాబు మాట్లాడారు. మంగళవారం ఘటనలను కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా కేంద్ర బలగాల సాయం కోరారు. పార్టీ సెంట్రల్ ఆఫీస్‌పై దాడి నేపథ్యంలో టీడీపీ శ్రేణులు..మంగళగిరి దగ్గర నేషనల్ హైవేపై ధర్నా చేపట్టారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పట్టాభి చేసిన వ్యాఖ్యలు జీర్ణించుకోలేక వైసీపీ శ్రేణులు ఈ దాడులకు తెగబడుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపించారు.
ఏపీలో పాలిటిక్స్ హీటెక్కడంతో... రాష్ట్ర వ్యాప్తంగా అదనపు పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ఆవేశాలకు గురికావొద్దని, అందరూ సంయమనం పాటించాలని ఏపీ డీజీపీ కార్యాలయం కోరింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.