వైసీపీ నేతల అక్రమాలను అడ్డుకుంటే దాడులా: చంద్రబాబు
Chandra Babu: దేవినేని ఉమపై వైసీపీ నేతల దాడి, పోలీసుల తీరుపై మండిపడ్డారు చంద్రబాబు.;
Chandra babu File Photo
Chandra Babu: దేవినేని ఉమపై వైసీపీ నేతల దాడి, పోలీసుల తీరుపై మండిపడ్డారు చంద్రబాబు..అక్రమ మైనింగ్ ని వెలికితీసేందుకు వెళ్లిన దేవినేని ఉమా కారుపై వైసీపీ గూండాలు దాడి చేయడడం ఏంటని ప్రశ్నించారు. అవినీతి,అక్రమాలను అడ్డుకుంటే దాడులకు పాల్పడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను అక్రమంగా అదుపులో తీసుకున్నారంటూ మండిపడ్డారు. అటు టీడీపీ నేతలు సైతం... పోలీసుల తీరును ఖండించారు.
దేవినేని ఉమపై దాడిని ఖండించారు టీడీపీ అధినేత చంద్రబాబు. టీడీపీ నేతల టార్గెట్ గా జరుగుతున్న దాడులపై డీజీపీకి లేఖ రాశారు చంద్రబాబు. దేవినేనిపై వైసీపీ గూండాలదాడి పిరికిపంద చర్యగా అన్నారు. వైసీపీ నేతల అవినీతి, అక్రమాలను అడ్డుకుంటే దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. అక్రమ మైనింగ్ ని వెలికితీసేందుకు వెళ్లిన దేవినేని ఉమా కారుపై వైసీపీ గూండాలు దాడి చేయడడం ఏంటని ప్రశ్నించారు. అవినీతి,అక్రమాలను అడ్డుకుంటే దాడులకు పాల్పడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కరిపై వంద మంది వైసీపీ గూండాల దాడి పిరికిపింద చర్య అన్నారు.
స్ధానిక ఎమ్మెల్యే వసంత క్రష్ణప్రసాద్ ప్రోథ్బలంతోనే ఈ దాడి జరిగిందన్నారు చంద్రబాబు. ఈ ఘటనలో నిందితులపై హత్యయత్నం కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి చేతకానిపాలనతో భవిష్యత్ లో తిరిగి వైసీపీ అధికారంలోకి రాదని ఆ పార్టీ నేతలు కార్యకర్తలకు అర్థమైందన్నారు.
కొండపల్లి ఫారెస్టులో అక్రమ మైనింగ్ తో వేలకోట్లు కొల్లగొట్టిన వసంత వీరప్పన్ బండారం బయటపెట్టారనే ఉమాపై దాడికి చేశారన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్. నిర్వాసితుల పక్షాన నిలిచి సర్కారుని నిలదీస్తున్నారనే కక్షతో..సజ్జల నాయకత్వంలో వైసీపీ రౌడీమూకలు దాడిచేశాయన్నారు. రాష్ట్రంలో అరాచక పాలనకి ఇది పరాకాష్ట అన్నారు లోకేష్. మాజీమంత్రి పైనే వైసీపీ గూండాలు దాడికి పాల్పడితే పోలీసులు ఏమయ్యారు? చట్టం ఎవరి చుట్టమైంది? ప్రశ్నిస్తే చంపేస్తారా? ఇది ప్రజాస్వామ్యమా? జగన్ స్వామ్యమా? డీజీపి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
దేవినేని ఉమాపై దాడి అమానుషమన్నారు అచ్చెన్నాయుడు. వైసీపీ గూండా రాజకీయాలను ఖండిస్తున్నామన్నారు. వైసీపీ నేతలు...అక్రమంగా గ్రావెల్ తవ్వుకుని లక్షలాది రూపాయల ప్రజల సొమ్ము దోచుకుంటున్నారన్నారు. పథకం ప్రకారమే ఉమాపై దాడి చేశారన్నారు. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఈ దాడికి ప్రేరేపించారని .దాడి చేస్తోన్న వైసీపీ కార్యకర్తలను అడ్డుకోవాల్సివస్తుందనే దాడి జరుగుతున్నా పోలీసులు ఘటనా స్థలానికి రాలేదంటూ ఆరోపించారు. డీజీపీ ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదున్నారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయకపోతే డీజీపీ కార్యాలయం ముందు నిరసనకు దిగుతామన్నరాు అచ్చెన్నాయుడు
దేవినేని ఉమాపై దాడిని ఖండించారు మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు. తక్షణణఏ వైసీపీ గూండాలను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.అక్రమాలను అడ్డుకునే వారిని లేకుండా చేయాలనుకోవడం దుర్మార్గమని, ఈ గూండాయిజం ఎళ్లవేళలా సాగదన్నారు. వైసీపీ అరాచకాలను రాష్ట్ర ప్రజానీకం గమనిస్తోంది. రౌడీ రాజ్యానికి ఆజ్యం పోసి రాష్ట్ర పరువు తీస్తున్నారు.