గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేత దారుణ హత్య!
ఓ వివాదంలో పంచాయతీకి అని పిలిచిన ప్రత్యర్థులు గొంతు కోసి చంపినట్లు... అంకులు అనుచరులు ఆరోపిస్తున్నారు. ఆయన పెదగార్లపాడు గ్రామంలో తెలుగుదేశం సర్పంచ్‌గా పనిచేశారు.;
గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యారు. పెద గార్లపాడుకు చెందిన పురంశెట్టి అంకులును వైసీపీకి చెందిన వ్యక్తులు దారుణంగా చంపారు. దాచేపల్లి సితార రెస్టారెంట్ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది. ఓ వివాదంలో పంచాయతీకి అని పిలిచిన ప్రత్యర్థులు గొంతు కోసి చంపినట్లు... అంకులు అనుచరులు ఆరోపిస్తున్నారు. ఆయన పెదగార్లపాడు గ్రామంలో తెలుగుదేశం సర్పంచ్‌గా పనిచేశారు.
అంకులు దారుణ హత్యపై ఆయన అనుచరులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఘటన సమాచారం తెలుసుకున్న ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అంకులును హత్య చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వెంటనే ఈ కేసులో చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేయడంతో... అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.