Divyavani : ఆసరా పేరుతో జగన్ మహిళలకు టోకరా వేస్తున్నారు : దివ్యవాణి
Divyavani : ఆసరా పేరుతో జగన్ రెడ్డి మహిళలకు టోకరా వేస్తున్నారని.. టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి విమర్శించారు.;
Divyavani : ఆసరా పేరుతో జగన్ రెడ్డి మహిళలకు టోకరా వేస్తున్నారని.. టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి విమర్శించారు. జగన్ పాలనలో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె మండిపడ్డారు. ఎంతో సంతోషంగా జరుపుకోవాల్సిన దసరా పండుగ సమయంలో మహిళలు మాంగల్యాలను తాకట్టు పెట్టి మరి జీవనాన్ని వెళ్ళదీసుకునే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల కోసం వైసీపీ సర్కార్ ఇప్పటి వరకు ఏం చేసిందో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.