Nara Lokesh : వైసీపీ నేతలు ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసానికి పాల్పడడం దుర్మార్గం : నారా లోకేష్
Nara Lokesh : జగన్ ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహాన్ని పక్కదారి పట్టించేందుకే ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు;
Nara Lokesh : జగన్ ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహాన్ని పక్కదారి పట్టించేందుకే ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. వైసీపీ నేతలు ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసానికి పాల్పడడం దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ తాడికొండలోనూ మహానాయకుడి విగ్రహాలను విద్వేషంతో పగలగొట్టేందుకు ప్రయత్నించారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షంపైనా, ప్రశ్నించే ప్రజలపైనే కాదు.. దేవతామూర్తులు, మహనీయుల విగ్రహాలపైనా దాడులు సర్వసాధారణమైపోయాయని అన్నారు. ఎన్టీఆర్ విగ్రహాల విధ్వంసంతో వైసీపీ తన పతనాన్ని తనే కొని తెచ్చుకుంటోందని హెచ్చరించారు. అధికారమదంతో విగ్రహాలను కూలగొడుతున్న జగన్ అండ్ కో.. ప్రజల గుండె గుడిలో కట్టుకున్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎప్పటికీ కూలదోయలేరని అన్నారు.
దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహంపై దాడిని ఖండిస్తూ.. టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఐతే.. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.