Chandrababu: గన్నవరం ఎయిర్‌పోర్టులో భావోద్వేగ వాతావరణం..
Chandrababu: ఎప్పుడూ గంభీరంగా కనిపించే మనిషి అపనిందలు భరించలేక తల్లిడిల్లి వెళ్లిపోతున్న సందర్భం.;
Chandrababu (tv5news.in)
Chandrababu: ఎప్పుడూ గంభీరంగా కనిపించే మనిషి అపనిందలు భరించలేక తల్లిడిల్లి వెళ్లిపోతున్న సందర్భం.. నడిపించే నాయకుడు కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యం.. ఓ వైపు బాధ.. మరోవైపు ఉద్వేగం.. గన్నవరం ఎయిర్‌పోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుకు నేతలు, కార్యకర్తలు వీడ్కోలు పలుకుతున్న సమయంలో ఒక ఉద్విగ్న వాతావరణం కనిపించింది.. చంద్రబాబుకు సెండాఫ్ ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో ఎయిర్‌పోర్టుకు చేరుకున్న పార్టీ నేతలు, కార్యకర్తలు.. ఆయన కోసం మోకాళ్లపై నుంచున్నారు..
చంద్రబాబు ఎయిర్‌పోర్టులోకి అడుగు పెట్టగానే మేమంతా మీ వెంటే అంటూ నినాదాలు చేశారు.. కొందర కార్యకర్తలు అధినేత కాళ్లకు దండం పెట్టారు.. మీకోసం ఎందాకైనా అంటూ నినదించారు టీడీపీ కార్యకర్తలు.. అందరినీ ఆప్యాయంగా పలుకరించి, బాధపడుతున్న కార్యకర్తల భుజం తట్టి ధైర్యం చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోయారు చంద్రబాబు.