టీడీపీ మినీ మేనిఫెస్టో..బస్సులు ద్వారా ప్రచారం..

ఐదు బస్సులపై చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టో పథకాలను స్టిక్కర్ల రూపంలో బస్సులకు అంటించారు.;

Update: 2023-06-19 07:30 GMT

రాజమహేంద్రవరం మహానాడులో ప్రకటించిన మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు టీడీపీ సమాయత్తం అయింది. రేపట్నుంచి ఏపీ అంతటా ఐదు బస్సులను తిప్పనుంది. ఈ ఐదు బస్సులపై చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టో పథకాలను స్టిక్కర్ల రూపంలో బస్సులకు అంటించారు. ఒక్కో పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ బస్సులు తిరగనున్నాయి. టీడీపీ నేతలు ప్రజలకు కరపత్రాలను పంచనున్నారు. ఇంటింటికి వెళ్లి మినీ మేనిఫెస్టోను ప్రజలకు అందజేయనున్నారు. నియోజకవర్గాల్లో ఉండే ఇంఛార్జ్‌లు సీనియర్‌ నేతలు అంతా ఈ బస్సుల్లో వెళ్లి రేపట్నుంచి ప్రచారం సైతం నిర్వహిస్తున్నారు.  

Tags:    

Similar News