చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ భేటీ.. కీలక అంశాలపై చర్చ
TDP: టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.. రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక అరాచకాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు.
Chandrababu File Image
Chadra babu: టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.. రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక అరాచకాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. లెక్కల్లో చూపని నిధులు, కేంద్రాన్ని మోసగించేలా అవలంబిస్తున్న విధానాలను పార్లమెంటులో లేవనెత్తాలని నిర్ణయించారు. కృష్ణా జలాలపై జరుగుతున్న వివాదాన్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సమావేశంలో తీర్మానించారు.. అంతర్ రాష్ట్ర జల వివాదంపై కేంద్రం జోక్యం కోరుతామని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ చెప్పారు. ఆస్తుల పరిరక్షణ, స్వలాభం కోసం జగన్ ఆడుతున్న నాటకాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తే ఎలాంటి మద్దతు ఇవ్వడానికైనా సిద్ధమన్నారు ఎంపీ రామ్మోహన్ నాయుడు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు టీడీపీ కట్టుబడి ఉందన్నారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుతున్నట్లు నటిస్తూ వైసీపీ నేతలు లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. రాఘురామపై అనర్హత వేటు వేయించేందుకే వైసీపీ ఎంపీలు శక్తినంతా కూడగడుతున్నారని, రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు వైసీపీ పట్టడం లేదన్నారు రామ్మోహన్ నాయుడు.