టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం ఇవాళ మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో జరగనుంది. అజెండాలో ఆరు అంశాలు పెట్టినట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవులు, శ్వేతపత్రాలు, విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక, సంస్థాగత వ్యవహారాలు వంటి అంశాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం. అలాగే టీటీడీపీ అధ్యక్షుడి ఎంపికపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాత జరుగుతున్న తొలి పోలిట్ బ్యూరో సమావేశం కావడంతో చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అదేవిధంగా పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం పైనా చర్చించనున్నారు. విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నిక అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది. మరోవైపు ఈ నిర్ణయాలపై నామినేటెడ్ పదవుల ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.