TDP protests: అద్దంకిలో టీడీపీ నేతల నిరసనలు.. ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్..
TDP Protests: వైసీపీ దాడిని నిరసిస్తూ ప్రకాశం జల్లా అద్దంకిలో టీడీపీ నేతలు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.;
Gottipati Ravikumar (tv5news.in)
TDP Protests: టీడీపీ కేంద్ర కార్యాలయం, పార్టీ నేతలపై వైసీపీ దాడిని నిరసిస్తూ ప్రకాశం జల్లా అద్దంకిలో టీడీపీ నేతలు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. అద్దంకిలోని రాంనగర్‌లో టీడీపీ నేతలు, కార్యకర్తలంతా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తీవ్ర గందరగోళ పరిస్థితి తలెత్తింది. పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళన చేస్తున్న టీడీపీ శ్రేణులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. మరోవైపు ధర్నాలో పాల్గొనేందుకు వస్తున్న ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ను పోలీసులు బొంతాళి వద్ద హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రకాశం జిల్లా అద్దంకిలో టీడీపీ శ్రేణుల ఆందోళన
అద్దంకిలోని రాంనగర్‌లో టీడీపీ కార్యకర్తల ధర్నా, రాస్తారోకో
జొంతాళి వద్ద ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ హౌస్ అరెస్ట్