సీఎం జగన్‌పై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఫైర్
విశాఖలో భూములు అమ్మాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. జగన్ అసమర్థ పాలన వల్లే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందన్నారు.;
ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్టీల్‌ప్లాంట్ భూముల్ని అమ్మేస్తున్న తుగ్లక్ ముఖ్యమంత్రి జగన్.. ఇపుడు విశాఖను అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. విశాఖలో భూములు అమ్మాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. జగన్ అసమర్థ పాలన వల్లే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందన్నారు. అన్ని విధాలుగా నష్టపోతున్న విశాఖ భవిష్యత్తు కోసం ప్రజలందరూ ఏకం కావాలని అయ్యన్నపాత్రుడు స్పష్టంచేశారు.