Nara Lokesh : గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత.. నారా లోకేశ్‌పై దాడికి యత్నం
Nara Lokesh : గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.. వైసీపీ శ్రేణుల ఓవరాక్షన్‌తో ఉద్రిక్తత చోటుచేసుకుంది.;
Nara Lokesh : గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.. వైసీపీ శ్రేణుల ఓవరాక్షన్‌తో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దుండగుల అఘాయిత్యానికి బలైన బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. అయితే, లోకేష్ సహా టీడీపీ శ్రేణులను అడుగడుగునా అడ్డుకున్నారు వైసీపీ నేతలు, కార్యకర్తలు.. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం లోకేష్ ప్రెస్‌మీట్ పెట్టేందుకు ప్రయత్నించగా.. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అనుచరులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు.. లోకేష్‌పై రాళ్లు కూడా రువ్వారు.. దీంతో టీడీపీ శ్రేణులు వైసీపీ వర్గీయులతో వాగ్వాదానికి దిగాయి..