అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకే రాజధాని ఫలాలు మొదట దక్కాలనేది చంద్రబాబు నాయుడుకి మొదటి నుంచి ఉన్న ఆలోచన. ఎందుకంటే తనను నమ్మి కొన్ని వేలమంది పంట భూములను త్యాగం చేశారు. కాబట్టి ఆ రైతుల త్యాగాలను మరవకూడదని.. వాళ్లకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలన్నది చంద్రబాబు నాయుడు ఉద్దేశం. ఇందులో భాగంగా నిన్న జరిగిన 53వ సి ఆర్ డి ఏ సమావేశంలో ఇదే అంశాన్ని మెయిన్ గా ప్రస్తావించారు. రైతులకు కౌలును వెంట వెంటనే అందించాలని.. ఆ విషయంలో లేట్ చేయొద్దు అన్నారు. అలాగే రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్ లను ఇస్తామని గతంలో హామీ ఇచ్చినందున.. వాటిని వెంటనే ఇచ్చేయాలన్నారు. ఈ విషయంలో ఏమాత్రం లేట్ చేయొద్దు అని అధికారులను ఆదేశించారు. రైతులు ఎక్కడ ఫ్లాట్ ఇచ్చారో తిరిగి అక్కడే కేటాయించాలన్నారు.
రైతులు ఏ ఊరిలో భూములు ఇస్తే ఆ ఊరిలోనే ఫ్లాట్ లు అలాట్ చేయాలన్నారు. రాజధానితో పాటు రైతులు కూడా అభివృద్ధి చెందాలన్నదే కూటమి ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. ఈ విషయంలో కిందిస్థాయి అధికారుల దాకా ఎలాంటి లేట్ చేయకుండా రైతులకు లబ్ధి చేకూరేలా చూడాలన్నారు. గత వైసిపి ప్రభుత్వంలో అమరావతి రైతుల నోట్లో మట్టి కొట్టారు. రాజధాని పనులు ఒక్కటి కూడా చేయకుండా.. భూములు ఇచ్చిన రైతులను కనీసం పట్టించుకోకుండా.. వాళ్లకు న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన ఫలాలు కూడా ఇవ్వలేదు. కౌలు ఇవ్వకుండా, ఫ్లాట్లు కేటాయించకుండా.. రైతులు ఉంటున్న చోట కనీసం వసతులు కల్పించకుండా ఇబ్బంది పెట్టారు. అందుకే అమరావతి రైతులు జగన్ ను, వైసీపీని అత్యంత దారుణంగా ఓడించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల కోసం ఆలోచిస్తున్నారు. అమరావతి ఈరోజు అభివృద్ధి చెందుతుంది. అనేక ఇంటర్నేషనల్ కంపెనీలు అమరావతికి వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో రైతుల్లో కూడా నమ్మకం పెరిగింది. అమరావతిని ఇక్కడి నుంచి తరలించలేరని చంద్రబాబు నాయుడు ప్రకటనతో రైతులు ప్రశాంతంగా ఉన్నారు.
హామీ ఇచ్చినట్టుగానే రైతుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుండడంతో కూటమి ప్రభుత్వంపై రైతుల్లో మంచి అభిప్రాయం పెరుగుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు రైతుల నుంచి ఎలాంటి అడ్డంకులు రాకపోతే అభివృద్ధి వేగంగా పరుగులు పెడుతుందని నమ్ముతున్నారు. అందుకే ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా రైతుల విషయంలో ఆలస్యం చేయొద్దు అంటున్నారు. తను నమ్ముకున్న వాళ్లకు ఎప్పటికీ అన్యాయం చేయనని ఈ విషయంతో మరోసారి నిరూపించుకున్నారు. ప్రస్తుతం అమరావతిలో పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పనులకు సంబంధించి నిన్న కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. బైపాస్ రోడ్డు ప్రారంభం, సెక్రటేరియట్ టవర్ల నిర్మాణం, రాజ్ భవన్ నిర్మాణం లాంటివి వేగంగా పూర్తి చేయాలన్నారు.