వైసీపీ నేతల అడ్డగోలు తప్పులు.. జగన్ చర్యలేవి..?

Update: 2025-11-07 08:30 GMT

వైసిపి పార్టీ నేతలు ఎన్ని తప్పులు చేసినా సరే మాజీ సీఎం జగన్ మాత్రం ఒక్క చర్య కూడా తీసుకోలేదు. పైగా వారినే వెనకేసుకొస్తూ.. మీదికి మాత్రం సుద్దులు చెబుతాడు. ఇదేమి విడ్డూరమంటూ ఏపీ ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మనకు తెలిసిందే కదా వైసీపీ నేతలు ఎన్ని మర్డర్లు చేసి కేసులు వేసుకున్నారో.. సాక్ష్యాధారాలతో సహా అడ్డంగా దొరికినా వారిపై జగన్ ఒక్క పార్టీ పరమైన చర్య కూడా తీసుకోలేదు. వైసిపి నేతల మీద అత్యాచార కేసులు నమోదైనా సరే వారిపై చర్యలు లేవు.

జోగి రమేష్ కల్తీ లిక్కర్ దందాను నడిపి వందలాది మంది ప్రాణాలను బలి తీసుకన్నా సరే అతన్ని వెనకేసుకొచ్చాడు. ఇక ఇప్పుడు వైసీపీ యూత్ లీడర్ కొండారెడ్డి డ్రగ్స్ సేవిస్తూ అడ్డంగా దొరికినా.. అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. పైగా నిన్న తాడేపల్లి ప్యాలెస్ లో వైసిపి యువజన విభాగం, విద్యార్థి విభాగంతో మీటింగ్ నిర్వహించి.. యువత చాలా పవిత్రంగా ఉండాలని.. ఎలాంటి చెడు అలవాటులకు బానిస కావొద్దు అంటే పిలుపునిచ్చాడు. దీనిపై జనసేన, టిడిపి నేతలు తీవ్ర విమర్శలు విమర్శలు గుప్పిస్తున్నారు

ఎందుకంటే పైకి నీతులు చెబుతే సరిపోదు కదా.. పార్టీలు తప్పు చేసినా వారిపై కఠినంగా చర్యలు తీసుకున్నప్పుడే జగన్ మాటలకు విలువ ఉంటుంది. అంతే గానీ నీతులు చెప్పి.. సొంత పార్టీలో నేతలు ఎన్ని తప్పులు చేసినా సరే కప్పిపుచ్చాలి అనుకోవడం అవివేకమే అవుతుంది. వల్లభనేని వంశీ ఎంతటి దారుణాలకు పాల్పడిన సరే కనీసం మందలించలేదు. అంబటి రాంబాబు ఆడియోలు లీకైనా సరే అవన్నీ తాను వినలేదు అన్నట్టు వ్యవహరించాడు. వైసిపి ఎమ్మెల్సీ తన సొంత డ్రైవర్ ను మర్డర్ చేసినా సరే.. పట్టనట్టు సైలెంట్ గా ఉన్నాడు. ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్ అయినా సరే తనకు తెలియదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం యూత్ లీడర్ కొండారెడ్డి విషయంలో కూడా ఇలాగే చేస్తున్నాడు. ఇది చూసిన జనాలు జగన్ చెప్పేది ఒకటి.. చేసేది ఇంకొకటి అని విమర్శలు గుర్తిస్తున్నారు.



Full View

Tags:    

Similar News