న్యాయం కోసం వెలితే చితకబాదిన పోలీసులు
112 కు డయల్ చేసిన పాపానికి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని చితకబాదారు పోలీసులు.;
రాజమండ్రి బొమ్మూరు పోలీస్ స్టేషన్‌లో దారుణం జరిగింది.112 కు డయల్ చేసిన పాపానికి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని చితకబాదారు పోలీసులు. న్యాయం చేయమని కోరినందుకు బాధితుడు నాగరాజు స్టేషన్‌లో పెట్టి లాఠీతో కొట్టారు. తీవ్ర మనస్థాపానికి గురైన నాగరాజు ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం అతను రాజమండ్రి జిల్లా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
సీఐ ప్రోద్బలంతో ఏఎస్‌ఐ భీమ శంకర్ తనను తీవ్రంగా కొట్టాడంటున్నాడు నాగరాజు. రాజనగారానికి చెందిన మోహన్ కుమార్ అనే వ్యక్తి 400 గజాల స్థలం 35 లక్షలకు అమ్మాడని, రిజిస్ట్రేషన్ చేసి 6 నెలలైనా ఇప్పటివరకు ఒరిజనల్ లింక్ డాక్యమెంట్లు ఇవ్వకుండా మోసం చేశాడని బాధితుడు నాగరాజు ఆరోపిస్తున్నాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానన్నాడు. పోలీసులు న్యాయం చేయకపోగా స్టేషన్‌లో పెట్టి లాఠీతో కొట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వాసుపత్రి అవుట్ పోలీస్ స్టేషన్ కేసునమోదు చేశారు పోలీసులు. ఓ మంత్రి అండతోనే బొమ్మూరు పోలీసులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.