Andhra Pradesh : కందుకూరు ఘటనలో అసలు నిజాలు.. వైసీపీ ఫేక్ ప్రచారం

Update: 2025-10-21 15:21 GMT

ఏపీలో కుల రాజకీయాలను వైసీపీ ఎక్కడికక్కడ బాగా వాడుకుంటుంది. టీడీపీ, జనసేన మధ్య గొడవలు సృష్టించి దాన్ని కులాలకు అంటగట్టి రాష్ట్రంలో అలజడి రేపడమే ఇప్పుడు వైసీపీ ప్రధాన ధ్యేయంగా పెట్టుకుంది. ఎందుకంటే ఆ పార్టీని ఇప్పుడు ఏపీలో ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూస్తున్న ప్రజలు వైసీపీని అస్సలు దేకట్లేదు. దీంతో రగిలిపోతున్న వైసీపీ ఇప్పుడు కందుకూరు ఘటనపై కుట్ర రాజకీయాలకు తెర లేపింది. వాస్తవానికి కందుకూరు ఘటనలో చనిపోయింది, చంపింది ఇద్దరూ టీడీపీ నేతలే. దీంతో టీడీపీ, జనసేన మధ్య చిచ్చు పెట్టడానికి వైసీపీకి ఛాన్స్ దొరకలేదు. అందుకే వీరి కులాలను బయటకు లాగింది.

చనిపోయిన లక్ష్మీ నాయుడిది కాపు సామాజిక వర్గం, చంపిన హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తిది కమ్మ కులం. ఇంకేముంది టీడీపీ అధికారంలో ఉంది కాబట్టే కమ్మ కులానికి చెందిన వ్యక్తి కాపు కులానికి చెందిన వ్యక్తిని చంపేశాడు అని వైసీపీ కుట్రకు తెరలేపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపులను రెచ్చగొట్టేందుకు ప్లాన్ వేసింది. కమ్మ, కాపు కులాల మధ్య చిచ్చు పెట్టి దాన్ని టీడీపీ, జనసేన పార్టీలకు ఆపాదించి ఒక అశాంతిని, అలజడిని సృష్టించే రాక్షస ప్రయత్నాలకు తెర తీసింది వైసీపీ. వైసీపీకి అనుకూలంగా ఉండే మీడియా ఛానెళ్లు, కొన్ని కుల సంఘాలు రంగంలోకి దిగి రకరకాల ఫేక్ ప్రచారాలకు తెర తీశారు. కమ్మ కులానికి చెందిన నిందితుడిని కూటమి కాపాడుతోందని తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు.

వాస్తవానికి ఇక్కడ జరిగింది ఇద్దరు వ్యక్తుల గొడవ. ఆర్థిక లావాదేవీల వల్ల జరిగిన హత్య. చనిపోయిన లక్ష్మీనాయుడు భార్య సుజాత కూడా తన భర్త, హరిశ్చంద్రప్రసాద్ చిన్నప్పటి నుంచి స్నేహితులే అని చెబుతోంది. ఇద్దరూ అన్యోన్యంగా ఉండేవారని.. కానీ ఆర్థిక లావాదేవీల వల్ల గొడవ జరిగిందని చెబుతోంది. అంతకు మించిన సాక్ష్యం ఇంకేముంటుంది. చంద్రబాబు నాయుడు స్వయంగా ఫోన్ చేసి సుజాతతో మాట్లాడారు. సుజాతకు రెండెకరాల భూమితో పాటు రూ.5 లక్షలు, ఇద్దరు పిల్లలకు రెండెకరాల చొప్పున భూమితో పాటు రూ.5లక్షల నగదు ఫిక్సిడ్‌ డిపాజిట్‌ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. లక్ష్మీనాయుడి పిల్లల్ని చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. కారు దాడిలో గాయపడిన పవన్‌కు 4 ఎకరాలు, రూ.5లక్షల నగదు, భార్గవ్‌కు రూ.3లక్షల పరిహారం సీఎం ప్రకటించారు. నిందితుడిపై చర్యలకు స్పెషల్ కోర్టును కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఇంతకన్నా ఇంకేం కావాలి. సీఎం స్వయంగా బాధితులను ఆదుకోవడంతో పాటు నిందితుడిపై కఠిన చర్యలకు దిగారు. ఇక్కడ ఆయన కులం చూడలేదు కదా. బాధితులకు అండగా నిలబడ్డారు. ఇప్పటికైనా వైసీపీ ఇలాంటివి మానుకుంటే బెటర్.


Full View

Tags:    

Similar News