Ap Theaters : ఏపీలో థియేటర్ల ఓనర్లకు ఊరట
ఏపీలో థియేటర్ల ఓనర్లకు ఊరటనిచ్చింది జగన్ ప్రభుత్వం. సీల్ చేసిన థియేటర్లు తిరిగి ఓపెన్ చేసేందుకు అనుమతినిచ్చింది.;
ఏపీలో థియేటర్ల ఓనర్లకు ఊరటనిచ్చింది జగన్ ప్రభుత్వం. సీల్ చేసిన థియేటర్లు తిరిగి ఓపెన్ చేసేందుకు అనుమతినిచ్చింది. థియేటర్ల ఓనర్లతో కలిసి మంత్రి పేర్నితో ఆర్.నారాయణమూర్తి భేటీ అయ్యారు. దీంతో థియేటర్లలో అన్ని వసతులు ఏర్పాటు చేసుకునేందుకు నెల రోజులసమయం ఇచ్చింది ప్రభుత్వం. ఆ తరువాత జాయింట్ కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పేర్ని నాని ఆదేశించారు. దీంతో 9 జిల్లాల్లో 83 థియేటర్లకు ఊరట లభించింది.