AP : ముగ్గురం మళ్లీ జతకట్టాం.. జగన్ నిలబడగలడా?: చంద్రబాబు

Update: 2024-04-12 04:50 GMT

చెత్తపై పన్ను వేసిన దుర్మార్గుడు సీఎం జగన్ అని చంద్రబాబు మండిపడ్డారు. ‘సీఎం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. సిద్ధం అంటున్న వారిపై యుద్ధం చేద్దామని పవన్ చెప్పారు. 2014లో పవన్ పోటీ చేయకుండా మద్దతిచ్చారు. గోదావరి జిల్లాల ప్రజలు వన్‌సైడ్ తీర్పిచ్చారు. మరోసారి మోదీ, నేను, పవన్ జతకట్టాం. నిలబడే దమ్ము జగన్‌కు ఉందా?మీరు నిలబడనిస్తారా? ఎన్నికలు లాంఛనమే. కూటమి గెలుస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.

భుత్వ ఉద్యోగులు సైతం జగన్ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. ‘విశాఖలో శంకర్ అనే కానిస్టేబుల్ ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులకు ఇవ్వాల్సిన నిధులు ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఈ దుర్మార్గులు మళ్లీ వస్తే ప్రజలు పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. గోదావరి, కృష్ణా లాంటి పవిత్ర నదులు పారే ఈ రాష్ట్రాన్ని గంజాయికి అడ్డాగా మార్చారు’ అని ఫైర్ అయ్యారు.

జగన్ పాలనలో రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని.. కాపాడుకోకపోతే రాష్ట్రాన్ని శాశ్వతంగా దక్కించుకోలేమని చంద్రబాబు అన్నారు. ‘ఆరోగ్య శ్రీ కింద వైద్యం పడకేసింది. బటన్ నొక్కింది ఎంత? వైసీపీ వాళ్లు దోచింది ఎంత? భూపరిరక్షణ చట్టం పేరుతో ప్రజల భూమిని తాకట్టు పెట్టి ఇతరులకు బదిలీ చేసే ప్రమాదం ఉంది. జగన్ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపారు. మద్యం తాకట్టు పెట్టి రూ.25 వేల కోట్లు తెచ్చారు’ అని ఆరోపించారు.

Tags:    

Similar News