Tollywood: రేపు టాలీవుడ్ ప్రముఖులతో వైఎస్ జగన్ భేటీ..

Tollywood: రేపు మెగాస్టార్‌ చిరంజీవి బృందం సీఎం జగన్‌తో భేటీ కానుంది.;

Update: 2022-02-09 04:17 GMT

Tollywood: రేపు మెగాస్టార్‌ చిరంజీవి బృందం సీఎం జగన్‌తో భేటీ కానుంది. ఈ కీలక సమావేశానికి నాగార్జున, మహేశ్‌బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌తో పాటు నిర్మాతలు దానయ్య, వంశీ, పలువురు ప్రముఖులు కూడా హాజరవుతారని ప్రచారం జరుగుతోంది. రేపు జరిగే మీటింగ్ తర్వాత సినిమా టికెట్ల వ్యవహారంపై జగన్‌ కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. మంత్రి పేర్ని నాని నేతృత్వంలోని కమిటీ అందించిన నివేదికలో బీ, సీ కేంద్రాల్లో సినిమా టికెట్ల ధరలు కనీసం 40 నుంచి 45 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు టికెట్ల ధరలపై ప్రభుత్వ నిర్ణయాన్ని విభేదిస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. రేపు పిటిషన్‌పై హైకోర్టు విచారించనుంది. ఈ నేపథ్యంలో మంత్రి పేర్నినాని.. కమిటీ నివేదికను సీఎంకు అందజేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Tags:    

Similar News