Tomato Price: అక్కడ టమాట ధర కిలో రూ. 27 మాత్రమే..
Tomato Price: దేశమంతా టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతుంటే.. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో వింత పరిస్థితి నెలకొంది.;
Tomato Price (tv5news.in)
Tomato Price: దేశమంతా టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతుంటే.. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో వింత పరిస్థితి నెలకొంది.. భారీ వర్షాలు, దిగుబడి తగ్గిపోడంతో పత్తికొండ మార్కెట్‌లో మొన్నటి వరకు కేజీ టమాటా 100 రూపాయల వరకు పలికింది.. అయితే, ఇప్పుడు ధర ఒక్కసారిగా పడిపోయింది.. ప్రస్తుతం కేజీ 27 రూపాయలు మాత్రమే డిమాండ్ ఉంది.. దీంతో రైతులు షాక్‌కు గురవుతున్నారు.. ఉన్నట్టుండి ఇంత భారీ వ్యత్యాసంతో ధరలు పడిపోవడం ఎవరికీ అర్థం కావడం లేదు..
అయితే, మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్ నుంచి దిగుబడులు వస్తున్నాయని వ్యాపారులు చెప్తున్నారు.. మిగతా చోట్ల టమాటా ధరలు తగ్గకుండా ఒక్క కర్నూలులోనే తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.. వ్యాపారులు దళారులు సిండికేట్‌గా మారి టమాటా ధరలను పతనం చేసి రైతు ఆదాయానికి గండి కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.